విశాఖ ఉక్కు కోసం విజయసాయిరెడ్డి విశాఖపట్నంలో పాదయాత్ర చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తప్ప ఒరిగేదేమీ లేదని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. దిల్లీలో ఆంధ్ర భవన్ నుంచి పార్లమెంట్ వరకూ లేదా మోదీ ఇంటి వరకూ పాదయాత్ర చేస్తే సమస్య కేంద్రానికి వినిపిస్తుందని హితవు పలికారు. సాయిరెడ్డిది పాదయాత్ర కాదు.. వాకింగ్ మాత్రమేనని మండిపడ్డారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు ముఖ్య సూత్రదారి విజయసాయిరెడ్డేనని విమర్శించారు. వైకాపా ఎంపీలు మొత్తం రాజీనామా చేసి స్పీకర్‌కు పంపితే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆగుతుంది తప్ప విశాఖలో పాదయాత్ర చేస్తే సమస్య జిల్లా దాటదని దుయ్యబట్టారు.
విజయసాయిరెడ్డి గారూ... పాదయాత్ర విశాఖలో కాదు దిల్లీలో చేయండి: బుద్దా వెంకన్న - విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ
ఎంపీ విజయసాయిరెడ్డిపై తెదేపా నేత బుద్దా వెంకన్న వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉక్కు పరిశ్రమ కోసం విశాఖలో పాదయాత్ర చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తప్ప ఒరిగేదేమీ లేదని దుయ్యబట్టారు. దిల్లీలో చేస్తే సమస్య కేంద్రానికి వినిపిస్తుందని హితవు పలికారు.
andhra pradesh panchayat elections