ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఫీజు కట్టలేదని పరీక్ష రాయొద్దన్న పాఠశాల యాజమాన్యం.. డీఈవోకు ఫిర్యాదు.. - St. Ann's School in Buchirajupalem

St. Ann's School : విశాఖ జిల్లా గోపాలపట్నం బుచ్చిరాజు పాలెం సెయింట్ ఆన్స్ స్కూల్ యాజమాన్యం తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

Buchirajupalem St Anns school
Buchirajupalem St Anns school

By

Published : Mar 31, 2022, 5:48 PM IST

St. Ann's School : విశాఖ జిల్లా గోపాలపట్నం బుచ్చిరాజు పాలెం సెయింట్ ఆన్స్ స్కూల్ యాజమాన్యం తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పరీక్ష ఫీజు కట్టాలని, లేకపోతే పరీక్ష రాయనివ్వమంటూ స్కూల్‌ యాజమాన్యం విద్యార్థులను హెచ్చరించింది. దీంతో తల్లిదండ్రులు ఫీజు కట్టడానికి వచ్చారు. అయినా కూడా విద్యార్థులను పరీక్షకు అనుమతించక పోవడంతో.. విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రిన్సిపల్‌ను నిలదీసినా ఫలితం లేకపోవడంతో డీఈవోకు ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి స్కూల్‌ యాజమాన్యాన్ని మందలించారు. ఇలాంటివి పునరావృతమైతే.. చర్యలు తప్పవన్నారు.

ఫీజు కట్టలేదని పరీక్ష రాయనీయని పాఠశాల యాజమాన్యం...డీఈవోకు ఫిర్యాదు...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details