ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మారుమూల ప్రాంతాల అభివృద్ధిలో జనాన్లు భాగస్వాములు:బీఎస్​ఎఫ్​ ఐజీ సతీష్​ చంద్ర

BSF IG Satish Chandra: ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని మారుమూల ప్రాంతాల అభివృద్ధిలో జవాన్లు భాగమయ్యారని బీఎస్​ఎఫ్​ ఐజీ చంద్ర బూడకోటి అన్నారు. జవాన్లు ఎంతో క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తున్నారని కొనియాడారు.

BSF IG Satish Chandra
బీఎస్​ఎఫ్​ ఐజీ సతీష్​ చంద్ర

By

Published : Mar 6, 2022, 5:20 PM IST

BSF IG Satish Chandra: ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో బీఎస్​ఎఫ్​ క్యాంప్​లు ఏర్పాటైన తర్వాత మారుమూల ప్రాంతాల అభివృద్ధిలో జవాన్లు బాగం అయ్యారని బీఎస్​ఎఫ్​ ఐజీ సతీష్​ చంద్ర బూడకోటి అన్నారు. జవాన్లు ఎంతో క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. మావోయిస్టులు ప్రాబల్యం వల్ల గతంలో ఈ ప్రాంతం అభివృద్ధికి దూరంగా ఉండేదన్నారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాలకు రహదారుల నిర్మాణం సాగుతోందన్నారు. మారుమూల ప్రాంతాలకూ ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయని... అధికారులు సందర్శిస్తున్నారని తెలిపారు. మార్చి 5న ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని బోండా ఆదిమజాతి గిరిజనులు నివసించే అండ్రహల్​ గ్రామం వద్ద ఉన్న బీఎస్​ఎఫ్​ క్యాంపును ఆయన సందర్శించారు. బీఎస్​ఎఫ్​ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం గిరిజన మహిళలతో కలిసి ఆదివాసీ సంప్రదాయమైన దింస నృత్యం చేశారు.

ABOUT THE AUTHOR

...view details