ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అన్నదమ్ముల ఔదార్యం.. నిరాశ్రయులకు సాయం..! - brothers helping for the homeless people in visakha city

ఎవరూ పట్టించుకోని అనాథల ఆహార్యాన్ని చూస్తేనే ఆమడ దూరం జరిగే రోజుల్లో.. అభాగ్యులకు తమ వంతు సాయం చేస్తున్నారా అన్నదమ్ములు. ఎంతోమంది సంపాదనే ధ్యేయంగా బతుకుతున్న ఈ రోజుల్లో.. కులవృత్తితో సమాజానికి సేవలు అందిస్తున్నారు. పదేళ్లుగా అనాథలకు ఉచితంగానే క్షవరం చేస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నారు.

brothers helping for the homeless people in visakha city
విశాఖలో అన్నదమ్ముల సాయం

By

Published : Apr 25, 2021, 5:14 PM IST

అన్నదమ్ముల ఔదార్యం.. నిరాశ్రయులకు సాయం..!

సకల సౌకర్యాలతో విలాసవంతంగా జీవించే వారు ఓవైపు.. కూడు, గూడు లేక పుట్‌పాత్‌లే ఆధారంగా కాలం వెల్లదీసే బతుకులు మరోవైపు. విశాఖలో ఎవరూ పట్టించుకోని అనాథలు, నిరాశ్రయులకు.. అన్నదమ్ములైన గంగరాజు, చిన్నారావు సేవలు చేస్తున్నారు. అనాథలు ఉన్న చోటకే వెళ్లి. .ఉచితంగా క్షవరం చేస్తూ తమ పెద్దమనసు చాటుకుంటున్నారు.

విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన గంగరాజు, చిన్నారావు.. 20ఏళ్ల క్రితం పనికోసం విశాఖ వచ్చారు. మహారాణిపేట పరిధిలోని పందిమెట్ట ప్రాంతంలో సెలూన్లు నిర్వహిస్తూ స్థిరపడ్డారు. తమకు ఉపాధి కల్పించిన విశాఖలో.. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయాలని సంకల్పించారు. అనాథల తలరాతలను మార్చలేకపోయినా.. కనీసం వారి జుట్టునైనా శుభ్రం చేయాలని భావించారు. తమ వృత్తికి సెలవురోజైన మంగళవారం ఆ సేవా కార్యక్రమం చేపడుతున్నారు. ఎంతో సంతృప్తినిస్తున్న ఈ సేవను.. తాము ఉన్నంత కాలం కొనసాగిస్తామని సోదరులిద్దరూ చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details