Ranabheerkapoor Movie: ప్రమోషన్లో భాగంగా ‘బ్రహ్మాస్త్ర’ చిత్ర బృందం విశాఖలో సందడి చేసింది. నటుడు రణ్‌బీర్ కపూర్, రాజమౌళి, సినిమా డైరెక్టర్ అయాన్ ముఖర్జీలకు విశాఖ విమానాశ్రయం వద్ద భారీ సంఖ్యలో అభిమానులు.. ఘనంగా స్వాగతం పలికారు. క్రేన్ సహాయంతో భారీ గజమాలను అభిమానులు రాజమౌళి, రణ్‌బీర్ కపూర్లకు వేసి సత్కరించారు. విశాఖ విమానాశ్రయం నుంచి చిత్ర యూనిట్ సభ్యులు ర్యాలీగా సింహాచలం ఆలయానికి చేరుకున్నారు. వీరికి ఆలయ ఈవో సూర్య కళ, ఆలయ ధర్మకర్తలు స్వాగతం పలికారు. స్వామివారి కప్ప స్తంభం అలింగనం తర్వాత స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితులు వేద ఆశీర్వచనం అందుకున్నారు. ఆలయ ఈవో స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా తొలిభాగం సెప్టెంబరు 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు దర్శకుడు అయాన్, రణ్‌బీర్, రాజమౌళి విశాఖపట్నం విచ్చేశారు. మెలొడీ థియేటర్ వేదికగా ఏర్పాటు చేసిన ‘మీట్ అండ్ గ్రీట్ విత్ ది టీమ్ బ్రహ్మాస్త్ర’ వేడుకకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Brahmastra: సినిమాలను అంగీకరించేందుకు బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ అనుసరించే విధానం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని దర్శకుడు రాజమౌళి అన్నారు. ముఖకవళికలతోనే మెప్పించగలిగే నటుల్లో రణ్‌బీర్ ఒకరిని కొనియాడారు. ‘బ్రహ్మాస్త్ర’ ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారు. రణ్‌బీర్‌కపూర్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, అలియాభట్ తదితరులు ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రమే ‘బ్రహ్మాస్త్ర’. ఈ సినిమాకి రాజమౌళి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
‘‘తానో పెద్ద ప్రాజెక్టును నిర్మించబోతున్నానని, ఓసారి కథ వినమని, నచ్చితే సమర్పకులుగా వ్యవహరించాలని కరణ్ జోహార్ నన్ను కోరారు.. ఒకే అన్నాను. దర్శకుడు అయాన్ ముఖర్జీ కలిసి ‘బ్రహ్మాస్త్ర’ కథ చెప్పారు. ఆయన స్క్రిప్టు వివరించిన తీరు, సినిమాలపై ఆయనకున్న ఆసక్తికి నేను ముగ్ధుడినయ్యా. అప్పటి వరకు తాను రూపొందించిన విజువల్స్ ఒక్కొక్కటిగా చూపిస్తుంటే ‘చిత్ర పరిశ్రమకు మరో పిచ్చోడు దొరికాడు’ అని అనుకున్నా. అలియాను నేను ‘యాక్షన్ పవర్ హౌస్’ అంటుంటా. చాలా తెలివైన నటి. ఏ పాత్రనైనా వెంటనే ఆకళింపు చేసుకుని దర్శకుడు కోరుకున్నట్టు నటించగలదామె. హావభావాలతో అందరినీ కట్టిపడేసే నటుల్లో రణ్‌బీర్ కపూర్ ఒకరు. ఇటీవల ఆయన గురించి ఓ విషయం తెలిసి, షాక్ అయ్యా. తాను కథ వినకుండా మనిషిని చూసి సినిమాను ఓకే చేస్తాడట’’ -రాజమౌళి, దర్శకుడు