ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆడుకుంటూ వెళ్లిన బాలుడు... అంతలోనే విషాదం - boy died news in water tank

విశాఖపట్నం బాలయ్య శాస్త్రి లేఅవుట్​ కాలనీలో విషాదం జరిగింది. ఆడుకుంటూ వెళ్లిన ఓ బాలుడు నీళ్ల ట్యాంకులో పడి మృతిచెందాడు. బాలుడి మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు విలపిస్తున్న ఘటన స్థానికులను కలిచివేసింది.

ఆడుకుంటూ వెళ్లిన బాలుడు... అంతలోనే విషాదం
ఆడుకుంటూ వెళ్లిన బాలుడు... అంతలోనే విషాదం

By

Published : Mar 2, 2020, 7:48 AM IST

ఆడుకుంటూ వెళ్లిన బాలుడు... అంతలోనే విషాదం

నిర్మాణంలో ఉన్న నీళ్ల ట్యాంకు​లో పడి నాలుగేళ్ల బాలుడు మృతిచెందిన ఘటన విశాఖలో జరిగింది. నగరంలోని బాలయ్య శాస్త్రి లేఅవుట్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద యశ్వంత్ అనే నాలుగేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి నీళ్ల ట్యాంకులో పడిపోయాడు. మధ్యాహ్నం నుంచి యశ్వంత్ కనిపించక పోవటంతో కుటుంబసభ్యులు గాలింపు చేపట్టారు. సాయంత్రం వేళలో నీళ్ల ట్యాంకులో బాలుడి మృత దేహం ఉన్నట్లు గుర్తించి బయటకు తీశారు. విగతజీవిగా పడివున్న బాలుడి మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు రోధిస్తున్న ఘటన స్థానికులను కలచివేసింది.

ఇదీ చూడండి:బావిలో మృతదేహం.. ఆలస్యంగా వెలుగులోకి విషయం

ABOUT THE AUTHOR

...view details