తిరుపతి ఉప ఎన్నికలో ఓడిపోతామని ముందే గ్రహించి..సానుభూతి కోసం చంద్రబాబు రాళ్లదాడి పేరుతో డ్రామాలాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. సభలో రాళ్ల దాడి జరిగిందనటానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు.
భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడిన తీరు ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు భాజపా అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా ఉంటే చెప్పాలన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో 80 శాతం ఓట్లు వైకాపాకే వస్తాయన్నారు. భాజపా, తెదేపా మిగతా 20 శాతం ఓట్లను పంచుకుంటాయని జోస్యం చెప్పారు.