Boiler exploded in Iron Industry: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బుగ్గ సమీపంలో ఉన్న సాయి సింధు ఐరన్ పరిశ్రమలో ఇనుమును కరిగించే బాయిలర్ పేలింది. అయితే అదృష్టవశాత్తు బాయిలర్ పేలిన సమయానికి.. ఘటనా స్థలంలో కార్మికులు తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. కొంతమంది కార్మికులు బాయిలర్కు దూరంగా పనిలో నిమగ్నమై ఉండగా ఈ ప్రమాదం సంభవించింది. వారిలో కొందరికి చిన్నపాటి గాయాలయ్యాయి. గాయపడిన కార్మికులకు పరిశ్రమలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదానికి కారణాలు, ప్రమాదం జరిగిన తీరు వంటి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఐరన్ పరిశ్రమలో పేలిన బాయిలర్.. తప్పిన పెను ప్రమాదం - Boiler exploded in Iron Industry in Buggi
Boiler exploded in Iron Industry: అచ్యుతాపురం గ్యాస్ లీక్ ఘటన మరువక ముందే రాష్ట్రంలో మరొక ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని ఓ ఇనుప పరిశ్రమలో బాయిలర్ పేలింది. అయితే అదృష్టవశాత్తు ఘటన జరిగిన సమయంలో కార్మికులు తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది.
![ఐరన్ పరిశ్రమలో పేలిన బాయిలర్.. తప్పిన పెను ప్రమాదం Boiler exploded in Iron Industry](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15505584-396-15505584-1654686625969.jpg)
Boiler exploded in Iron Industry
ఐరన్ పరిశ్రమలో పేలిన బాయిలర్..తప్పిన పెను ప్రమాదం...