ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా నుంచి తేరుకోకముందే.. బ్లాక్ ఫంగస్ కాటేస్తోంది..

కరోనా మహమ్మారి సృష్టిస్తున్న అలజడి నుంచి తేరుకోకముందే... బ్లాక్ ఫంగస్ రూపంలో మరో రక్కసి పంజా విసురుతోంది. విశాఖ జిల్లాను అతాలాకుతలం చేస్తున్న కరోనాను జయించామని ఊపిరి పీల్చుకునే లోపే.. కొత్త అవతారమెత్తి బ్లాక్ ఫంగస్ కబళిస్తోంది. ప్రభుత్వం ముందస్తు చర్యలు ఈ రక్కసి నుంచి కాపాడలేకపోతున్నాయి. తాజాగా విశాఖలోని మధురవాడలో బ్లాక్ ఫంగస్​కు ఓ మహిళ బలైంది. దీన్ని వైద్యాధికారులు బ్లాక్ ఫంగస్ మృతిగా ఇంకా ధ్రువీకరించలేదు.

బ్లాక్ ఫంగస్
బ్లాక్ ఫంగస్

By

Published : May 18, 2021, 4:26 PM IST

బ్లాక్ ఫంగస్ వ్యాధితో విశాఖ మధురవాడ పోతిన మల్లయ్యపాలెం నివాసి లక్ష్మీ మృతి చెందింది. అధికారులు స్పందించి వ్యాధి ప్రబలకుండా నివారణ చర్యలు తీసుకోవాలని భాజపా రాష్ట్ర వైద్య విభాగం కోరుతోంది. బ్లాక్​ ఫంగస్​ని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో ముందు జాగ్రత్త చర్యగా కొన్ని ముఖ్యమైన ఆసుపత్రుల్లో అన్ని వసతులతో ప్రత్యేక డాక్టర్ల బృందం పర్యవేక్షణ, ఇంజక్షన్స్, మందులను సిద్ధంగా ఉంచాలని భాజపా వైద్య విభాగం కన్వీనర్ రూపాకుల రవికుమార్ డిమాండ్ చేశారు.

కరోనా బాధితులకు అతిగా స్టెరాయిడ్స్ వాడడం కారణంగానే బ్లాక్ ఫంగస్ సంక్రమిస్తోందని.. వైద్యులు చెప్తున్నారని రవికుమార్ పేర్కొన్నారు. ఈ వ్యాధితో మరణించిన లక్ష్మీ కుటుంబానికి ఆర్థిక సాయం, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని కోరారు. బ్లాక్ ఫంగస్ మృతిని జిల్లా వైద్యాధికారులు మాత్రం అధికారికంగా నిర్ధారించడం లేదని ఆవేదన చెందారు. పేద రోగుల విషయంలో వెంటనే స్పందించి సకాలంలో నాణ్యమైన వైద్యం అందించి, ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అధికారులదేనని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండీ... రాష్ట్రంలో కర్ఫ్యూతో ప్రభావమెంత? పాజిటివిటీ రేటు కాస్తైనా తగ్గిందా?

ABOUT THE AUTHOR

...view details