స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఇలాంటి నియంతృత్వ పాలన ఎప్పుడూ లేదని భాజపా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన ప్రజావేదికని కూలగొట్టడం నుంచి ప్రారంభమైందన్నారు. సీఎం జగన్ నియంతృత్వ పాలన విడనాడాలని సూచించారు.
రైతులను కాపాడేందుకే దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నూతన వ్యవసాయ బిల్లులను తీసుకువచ్చారని వివరించారు. దళారుల నుంచి రైతులను కాపాడేందుకు ఈ వ్యవసాయ బిల్లును తీసుకొస్తే... ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.