విశాఖను స్మార్ట్ సిటీగా కాకుండా మార్ట్గేజ్ (mortgage) సిటీగా మార్చారని వైకాపా ప్రభుత్వంపై భాజపా నేత విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. చివరికి పిల్లలు చదువుకునే పాలిటెక్నిక్ కళాశాలను కూడా తాకట్టు పెట్టారని విమర్శించారు.
Vishnu On VMRDA: విశాఖను మార్ట్గేజ్ సిటీగా మార్చారు: విష్ణుకుమార్ రాజు
విశాఖను స్మార్ట్ సిటీగా కాకుండా మార్ట్గేజ్ (mortgage) సిటీగా మార్చారని వైకాపా ప్రభుత్వంపై భాజపా నేత విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. ప్రజా ఆస్తులు తాకట్టు పెట్టడానికి అధికారం ఎవరిచ్చారని ప్రభుత్వాన్ని నిలదీశారు.
మాస్టర్ ప్లాన్ పేరుతో డ్రాయింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేస్తున్నారని విష్ణుకుమార్ రాజు ఎద్దేవా చేశారు. అందరూ వ్యతిరేకించినా ఈ నెల 15 నుంచి నూతన మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని చెప్పటం దారుణమన్నారు. ఇంకో రెండేళ్లు ఉంటే ప్రభుత్వం మారిపోతుందన్న విషయాన్ని వీఎంఆర్డీ అధికారులు గుర్తుంచుకోవాలన్నారు. ప్రజా ఆస్తులు తాకట్టు పెట్టడానికి అధికారం ఎవరిచ్చారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇడుపులపాయలో సీఎం సొంత ఆస్తులు ఉన్నాయని..,కావాలంటే వాటిని తాకట్టు పెట్టుకోవాలని హితవు పలికారు. వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.
ఇదీ చదవండి: పవన్ చెప్పినట్లు అన్ని పార్టీలు ప్రభుత్వంపై పోరాడాలి: విష్ణుకుమార్ రాజు