ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలి: సునీల్ థియోధర్

విశాఖ భాజపా కార్యాలయంలో జరిగిన 'ఊపిరి పువ్వులు' పుస్తకావిష్కరణలో..ఆ పార్టీ జాతీయ కార్యదర్శి, ఏపీ భాజపా ఇన్​ఛార్జి సునీల్ థియోధర్ పాల్గొన్నారు. కరోనాపై అవగాహన కల్పించడానికి బీజేవైఎం ఆధ్వర్యంలో కవితలు, కథల పోటీలు నిర్వహించింది. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఈ కార్యక్రమంలో బహుమతులు అందించారు. కరోనా వ్యాక్సిన్ వచ్చేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సునీల్ థియోధర్ సూచించారు.

sunil deodhar
sunil deodhar

By

Published : Nov 2, 2020, 8:13 PM IST

విశాఖ భాజపా కార్యాలయంలో 'ఊపిరి పువ్వులు' పుస్తకావిష్కరణ జరిగింది. భాజపా జాతీయ కార్యదర్శి, ఏపీ ఇన్​ఛార్జి సునీల్ థియోధర్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీజేవైఎం నేతృత్వంలో కరోనాపై కవితలు, కథల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఊపిరి పువ్వులు చాలా మంచి పుస్తకమని సునీల్ థియోధర్ కితాబిచ్చారు. కరోనాకి వాక్సిన్ వచ్చేవరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.

నాయకులు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. సంక్లిష్ట సమయంలో అన్ని వర్గాలను ప్రధాని మోదీ ఆదుకున్నారని చెప్పారు. మాణిక్యాలరావుతో సహా ఎంతోమంది భాజపా నేతలు కరోనా బారినపడి మృతి చెందారని ఆవేదన చెందారు.

ఇదీ చదవండి :రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టుపెట్టారు: అచ్చెన్న

ABOUT THE AUTHOR

...view details