కరోనా వల్ల ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వారికి భాజపా ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. విశాఖ మహారాణి పేటలోని ప్రకృతి చికిత్సాలయంలో రూపాకుల విశాలాక్షి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బియ్యం, నూనె, గోధుమపిండి తదితర నిత్యావసరాలను అందజేశారు. భాజపా వైద్య విభాగం రాష్ట్ర కన్వీనర్ ఆర్.రవి కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మెహర్ బాబా ఆర్థిక సాయంతో నిత్యావసరాలు పేదలకు అందజేశారు.
పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ మాధవ్ - విశాఖలో పేదలకు నిత్యావసవరాలు పంపిణీ
విశాఖలో రూపాకుల విశాలాక్షి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో... భాజపా ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. భాజపా వైద్య విభాగం నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. లాక్ డౌన్ విధింపు నుంచి నేటి వరకూ రూపాకుల విశాలాక్షి ఛారిటబుల్ ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు చేసిందని మాధవ్ అన్నారు.
పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ మాధవ్
గడిచిన 110 రోజులుగా రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలను మాధవ్ కొనియాడారు. ప్రతి ఒక్కరూ మాస్కులు, గ్లోవ్స్ తప్పనిసరిగా వాడాలని మాధవ్ కోరారు. కార్యక్రమంలో డాక్టర్. శిష్ట్లా శ్రీలక్ష్మి, మెహర్ బాబా, ఎస్ మహేష్, పల్లా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసుల పెరుగుదల