ఇసుక అందక సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భాజపా ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ అన్నారు. చిన్నపాటి ఇళ్లను నిర్మించుకుందామని అనుకున్న వారికి ఇసుక లభ్యం కావడంలేదని అరోపించారు. విశాఖలోని అరిలోవ ఇసుక ర్యాంపు వద్ద పార్టీ నాయకులతో పాటు ప్లకార్డులు పట్టుకుని ఆయన నిరసన తెలిపారు.
ఇసుక విధానంలో పారదర్శకత ఏది..? - భవన నిర్మాణ రంగం తాజా వార్తలు
ఇసుక కొరతను నిరసిస్తూ విశాఖలోని అరిలోవ ఇసుక ర్యాంపు వద్ద భాజపా ఎమ్మెల్సీ మాధవ్ ఆందోళన చేపట్టారు. నిర్మాణరంగం, భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలు తీరేలా కొత్త ఇసుక విధానాన్ని వెంటనే తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
అరిలోవ ఇసుక యార్డు వద్ద ఆందోళన చేపట్టిన భాజాపా ఎమ్మెల్సీ మాధవ్
ఇసుక విధానంలో పారదర్శకత తీసుకొస్తామంటూ ఏడాదిగా చెబుతున్న వైకాపా ప్రభుత్వం ప్రజల కష్టాలను మరింత పెంచేలా నిర్ణయాలు తీసుకుందని ధ్వజమెత్తారు. ఇది సామాన్య కూలీలకు కూడా ఇబ్బంది కలిగిస్తోందని చెప్పారు. అసలే కరోనాతో కుదేలైన నిర్మాణ రంగంతో పాటు చిన్నపాటి నిర్మాణాలు చేసుకునే వారు తీవ్రస్దాయిలో ఇసుక సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఈ విషయమై అధికారులు స్పందించి వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.