ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్న ప్లాటీ పస్ ఎస్కేప్స్ బృందాన్ని విశాఖ భాజపా నాయకులు అభినందించారు. బీచ్ రోడ్డులోని భాజపా కార్యాలయంలో సుభాష్, పద్మావతి సహా సముద్రం లోతుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగిస్తున్న బృంద సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్ సహా విశాఖ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. జీవీఎంసీ అధికారులు సముద్రంలోకి ప్లాస్టిక్ వ్యర్థాలు రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సముద్రంలో ప్లాస్టిక్ కారణంగా జరుగుతున్న నష్టంపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ప్లాటిపస్ ఎస్కేప్ బృందంతో కలిసి నిర్వహిస్తామని మాజీ ఎంపీ హరిబాబు వెల్లడించారు.
మోదీ మెచ్చిన స్వచ్ఛ సేవకులకు సన్మానం - మోదీ మెచ్చిన స్కూబా డైవర్లు
స్కూబా డైవింగ్ ద్వారా సముద్రంలోని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తున్న సుభాష్ బృందాన్ని విశాఖ భాజపా నేతలు సన్మానించారు. వారి కృషి ఎంతో మందికి ఆదర్శమని అభినందించారు.
scuba