ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బంగాల్​లో భాజపా కార్యకర్తలపై దాడులు, అత్యాచారాలు: విష్ణుకుమార్​ రాజు - election news

పశ్చిమ బంగాల్​ లో టీఎంసీ తిరిగి గెలిచిననాటి నుంచి తమ పార్టీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని విష్ణుకుమార్​ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా మమతా బెనర్జీ తన తీరు మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.

విష్ణుకుమార్​ రాజు
తృణమూల్​ అధినేత్రిపై మండిపడ్డ విష్ణుకుమార్​ రాజు

By

Published : May 5, 2021, 7:34 PM IST

పశ్చిమ బంగాల్​ లో ఎన్నిక ఫలితాలు ప్రకటించాక తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భాజపా నాయకులు, కార్యకర్తలపై దాడులు, మహిళా కార్యకర్తలపై అత్యాచారాలు జరుగుతున్నాయని రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రాజు ఆరోపించారు.

ప్రస్తుత పరిస్థితులు 1971 లో బంగ్లాదేశ్​లో నెలకొన్న భయానక సంఘటనలను గుర్తుచేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అక్కడ జరుగుతున్న మారణకాండకు నిరసనగా.. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. అక్కడ మమత ప్రవర్తన అత్యంత దారుణంగా ఉందని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details