అప్పులు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం అగ్రగామిగా ఉందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి అన్నారు. ఆమె విశాఖలో పర్యటించారు. రాబోయే ఆదాయాన్ని చూపించి.. అప్పులు చేయడం ఒక్క ఏపీలోనే చూస్తున్నానని చెప్పారు. జీవీఎంసీలో ఆస్తులను సైతం కుదవపెట్టి అప్పు తెచ్చుకుంటారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మూడేళ్లలో 3లక్షల కోట్లు అప్పు..చివరకు జీవీఎంసీ ఆస్తులూ తాకట్టు : పురందేశ్వరి - పురందేశ్వరి
భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి విశాఖలో పర్యటించారు. మూడేళ్లలో 3 లక్షల కోట్లు అప్పు చేసి ప్రజలకు భారం మోపారని.. వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డారు. అప్పులు చేయడంలో రాష్ట్రం అగ్రగామిగా ఉందన్నారు.
ap bjp leader purandeswari
మూడేళ్లలో 3లక్షల కోట్లు అప్పుచేసి ప్రజలకు భారం మోపారన్న పురందేశ్వరి.. కేంద్రం నిధులిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం గుప్పెడు మట్టి కూడా వేయలేదని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎంపీకే రక్షణ లేకుండా పోయిందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ఉన్న భూమిని అమ్మేప్రసక్తే లేదని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసినట్లు చెప్పారు.
ఇదీ చదవండి:గౌతమ్‌రెడ్డి శాఖలు ఎవరికి?
Last Updated : Feb 27, 2022, 1:22 PM IST