కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 7 లక్షల పీఎంఏవై ఇళ్లను మంజూరు చేసిందని ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలు సాగిస్తూ... పేదవారికి ఇళ్లను ఇవ్వడం లేదని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల భాగస్వామ్యంతో చేపట్టిన ఈ పథకాన్ని పేదవానికి చేరకుండా చేయడం అన్యాయమన్నారు. అర్హులైన వారికి ఇల్లు మంజూరయ్యేవరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
పీఎంఏవై ఇళ్లను అర్హులైన పేదలకు ఇవ్వండి: ఎమ్మెల్సీ మాధవ్ - విశాఖలో భాజపా ఆందోళన
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం కింద పూర్తి చేసిన ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు అందజేయాలని ఎమ్మెల్సీ మాధవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై విశాఖ నగర పాలక సంస్థ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద భాజపా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
విశాఖలో భాజపా ధర్నా