గణేష్ ఉత్సవాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భాజపా, బీజేవైఎం నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు గణేశ్ విగ్రహాన్ని తలపై పెట్టుకుని విశాఖ కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లారు. ఈ నిరసనలో రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి పాల్గొన్నారు. మండపాల్లో ఉత్సవాల నిర్వహణకు అనుమతివ్వాలని భాజపా శ్రేణులు డిమాండ్ చేశారు. సోము వీర్రాజు అరెస్టును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.
చవితి ఉత్సవాలకు అనుమతివ్వాల్సిందే..భాజపా డిమాండ్ - BJP leaders protest in Visakhapatnam
వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. భాజపా, బీజేవైఎం నాయకులు విశాఖ కలెక్టరేట్‌ను ముట్టడించారు. రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఈ నిరసనలో పాల్గొన్నారు.
భాజపా నేతల నిరసన
Last Updated : Sep 6, 2021, 8:30 PM IST