బంగాళాఖాతం తీరం వెంబడి ఉన్న దేశాల మధ్య బహుళ రంగాలు... సాంకేతిక ఆర్థిక రంగాల సమన్వయ సదస్సుకు విశాఖ సిద్ధమైంది. బిమ్స్‌టెక్ సదస్సు నిర్వహణలో భారత్ సహా నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, శ్రీలంక ఉన్నాయి. ఈ సదస్సులు వివిధ అంశాలపై... వేర్వేరు చోట్ల జరిగాయి. తొలిసారిగా పోర్టులు-సముద్రాలకు సంబంధించి నిర్వహిస్తున్నారు. నౌకా వాణిజ్యం, పరస్పర సహకారానికి అనువైన పరిస్థితులు, బంగాళాఖాతం తీరం వెంట ఉండే దేశాలు... నౌకావాణిజ్యం భద్రతపై పంచుకోవాల్సిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. 2 రోజులు పాటు జరిగే ఈ సదస్సులో... 5 ప్రధాన అంశాలు చర్చకు వస్తాయి.
విశాఖ వేదికగా బిమ్స్‌టెక్ సదస్సు - BimStec news
విశాఖ నగరం వేదికగా అంతర్జాతీయ బిమ్స్‌టెక్ సదస్సు ఇవాళ ప్రారంభం కానుంది. రేపటి వరకూ జరిగే ఈ సదస్సుకు 7 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ పోర్టుల ఛైర్మన్‌లు, ప్రైవేటు పోర్టుల సీఈవోలు హజరవుతున్న ఈ సదస్సులో... పలు అంశాలు చర్చించనున్నారు.
విశాఖ వేదికగా బిమ్స్‌టెక్ సదస్సు