విశాఖ జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతం వంజంగిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం-కారు ఢీకొని నవ వధువు మృతిచెందింది. పర్యాటక అందాలు తిలకించేందుకు భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భార్య హేమ అక్కడికక్కడే మృతిచెందగా, భర్త తరుణ్ కుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
New Bride Death : పర్యాటక ప్రాంతాన్ని చూసేందుకు వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు... - విశాఖ జిల్లా వార్తలు
విశాఖ జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతం వంజంగి రహదారిలో ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం, కారు ఢీకొని నవ వధువు మృతిచెందింది. పర్యాటక అందాలు తిలకించేందుకు భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
పర్యాటక ప్రాంతాన్ని చూసేందుకు వెళ్తూ... తిరిగిరాని లోకాలకు...
వంజంగిని తిలకించేందుకు విశాఖ సీతంపేట నుంచి మూడు ద్విచక్రవాహనాలపై స్నేహితులతో కలిసి ఈ నవ దంపతులు వస్తుండగా.. వారి బైక్ ప్రమాదానికి గురైంది. కాగా.. భార్య చనిపోయిన విషయం తెలియని భర్త ఆస్పత్రిలో చికిత్సపొందుతూ.. హేమను పిలవండి అంటూ విలపించడం అందరి కంట కన్నీరు తెప్పించింది.
ఇదీ చదవండి : వేర్వేరు పెళ్లిళ్లు.. అయినా కలిసి బతకాలని కట్టుదాటారు.. కానీ