ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్.. విశాఖలో త్వరలో ప్రారంభం! - ఈ ఏడాది చివరిలోగా విశాఖలో ప్రారంభం కానున్న నీటిలో తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్

దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్.. ఏపీలో నిర్మితం అవుతోంది. విశాఖ మేఘాద్రి గడ్డ జలాశయంలోని 155 ఎకరాల్లో.. ఎన్టీపీసీ సింహాద్రి యూనిట్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి నిర్మాణాన్ని పూర్తిచేసి.. జాతికి అంకితం చేసేందుకు కృషి చేస్తోంది.

biggest floating solar plant will start function soon in ap
విశాఖలో వేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్

By

Published : Feb 9, 2021, 5:31 PM IST

2,025 మెగావాట్ల సామర్థ్యంతో.. దేశంలోనే అతిపెద్ద నీటిలో తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్ సిద్ధం అవుతోంది. విశాఖలోని మేఘాద్రి గడ్డ జలాశయంలో 155 ఎకరాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్ట్​ను.. ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జాతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఎన్టీపీసీ) సింహాద్రి యూనిట్ నిర్మిస్తున్న ఈ ప్లాంట్.. కొద్ది నెలల్లోనే విద్యుత్ ఉత్పత్తిని మొదలుపెట్టనుంది.

రూ. 110 కోట్ల వ్యయంతో రెండేళ్ల క్రితమే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించినా.. కొవిడ్ దృష్ట్యా అడ్డంకులు రావడంతో ప్రక్రియ నెమ్మదించింది. ప్రస్తుతం వేగంగా పనులు తిరిగి ప్రారంభించడంతో.. ఈ ప్రాజెక్టు అత్యంత త్వరగా ఏపీకి అందుబాటులోకి రానుంది. దీని ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్​ను మొదటగా ఏపీ అవసరాల కోసం వినియోగించుకుని.. అనంతరం ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేయాలని ఎన్టీపీసీ భావిస్తోంది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details