విజయనగరం జిల్లా భోగాపురంలో విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం 2,200 ఎకరాలతో పాటు అదనంగా మరో 500 ఎకరాల భూములను సేకరించింది. భూ సేకరణతో మర్లపాలెంలో 223, మూడసర్ల పేటలో 39, బొల్లికలపాలెంలో 55, రిల్లిపేటలో 65 కుటుంబాలను ఖాళీ చేయించాల్సి ఉంది. వీరికోసం గూడెపువలసలో 17 ఎకరాలు, పోలేపల్లి రెవెన్యూలోని లింగాలవలసలో 25 ఎకరాల్లో పునరావాస కాలనీలను నిర్మిస్తున్నారు.
గ్రామాలు తరలించే నాటికి బాధిత యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు ఆర్ఆర్ ప్యాకేజీ ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారని నిర్వాసితులు తెలిపారు. కానీ ఇప్పటివరకు తమకు ఎలాంటి సహాయమూ అందలేదని, ప్రభుత్వం నుంచి ప్యాకేజీ వస్తే గ్రామం నుంచి వెళ్లిపోతామని వెల్లడించారు.