ఆంధ్ర ఊటీ అరకులోయకు సమీపంలో హొయలొలికించే జలపాతం ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తోంది. అరకు లోయకు సమీపంలోని డుంబ్రిగూడ మండలం లైగండ గ్రామ సమీపంలో సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జలపాతం చూపరులను మంత్ర ముగ్దులను చేస్తోంది. 6 బండరాళ్ల మధ్య నుంచి జాలువారుతున్న నీటి సోయగాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అరకులోయ లైగండ సమీపంలోని జలపాతం అందరినీ ఆనందపరుస్తున్నాయి. ప్రభుత్వం పర్యాటక శాఖ ఈ జలపాతానికి కొత్త సొబగులు అద్ది అభివృద్ధి చేస్తే అరకులోయ సిగలో మరోకొత్త అందం చేరుతుందని స్థానికులు అంటున్నారు. అధికారులు స్పందించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.
అలరిస్తున్న అరకు అందాలు...జాలువారుతున్న జలపాతం
అరకులోయ సమీపంలో ప్రకృతి అందాలు చూపరులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. డుంబ్రిగూడ మండలం లైగండ గ్రామ సమీపంలో సుమారు 100అడుగుల ఎత్తునుంచి జాలువారుతున్న జలపాతం ప్రకృతి ప్రేమికులను అలరిస్తోంది.
అలరిస్తున్న అరకులోయ అందాలు...