విశాఖ బీచ్లో రాష్ట్రస్థాయి బీచ్ కుస్తీ పోటీలు ఘనంగా జరిగాయి. ఈ పోటీలకు వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. ఈ పోటీల్లో ఓవర్ ఆల్ ఛాంపియన్గా విశాఖ జట్టు నిలిచింది. తరవాత స్థానాన్ని తూర్పుగోదావరి జిల్లా జట్టు నిలుపుకుంది. జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్, విశాఖ వెస్ట్ శాసన సభ్యులు పీవీజీఆర్ గణబాబు క్రీడాకారులకు బహుమతులు అందించారు.
విశాఖలో.. అలరించిన బీచ్ కుస్తీ పోటీలు - wrestling championship at visakha
విశాఖలో బీచ్ కుస్తీ పోటీలు ఘనంగా జరిగాయి. ఛాంపియన్గా విశాఖ జట్టు నిలిచింది. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జతీయ స్థాయిలో జరిగే పోటీలకు పంపనున్నారు.
విశాఖలో బీచ్ కుస్తీ పోటీలు
ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జతీయ స్థాయిలో జరిగే పోటీలకు పంపనున్నారు. బీచ్ కుస్తీ పోటీలు విశాఖలో నిర్వహించడం ఇదే మొదటి సారి. రానున్న రోజుల్లో జాతీయ పోటీలకు విశాఖ వేదిక అవుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: theft in simhachalam temple : సింహాద్రి అప్పన్న అనుబంధ ఆలయంలో చోరీ