ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మహేంద్రసింగ్ ధోనీ ప్రతిఒక్కరికీ ఆదర్శం' - వైజాగ్​లో ధోనీ గురించి మాట్లాడిన ఎమ్మెస్కే ప్రసాద్

భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ జీవితం ప్రతిఒక్కరికీ ఆదర్శమని.. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. విశాఖలో 'బికమింగ్ ఏజెంట్స్ ఆఫ్ ఛేంజ్' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

bcci chief selector msk prasad said ms dhoni is ideal for everyone
బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్

By

Published : Feb 7, 2020, 8:58 PM IST

బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్

విశాఖలో యంగ్ ఇండియన్స్ సంస్థ ఆధ్వర్యంలో 'బికమింగ్ ఏజెంట్స్ ఆఫ్ ఛేంజ్' అనే అంశంపై సదస్సు నిర్వహించారు. గీతం విశ్వవిద్యాలయం సహకారంతో 'యంగ్ ఇండియన్స్' వార్షిక సమావేశంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. భారత జట్టు మాజీ సారథి ఎమ్మెస్ ధోనీ జీవితం ప్రతిఒక్కరికీ ఆదర్శమన్నారు. మహీ తన జీవితాన్ని మలుచుకున్న తీరు ప్రశంసనీయమని కొనియాడారు. సామాజిక బాధ్యత దిశగా యువత ముందడుగు వేయాలని యంగ్ ఇండియన్స్ ప్రతినిథులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పాప్ సింగర్ స్మిత, సినీ గేయ రచయిత అనంత శ్రీరాం పాల్గొన్నారు.

ఇవీ చదవండి..అతడి బ్యాటింగ్​లో మ్యాజిక్ ఉంది: సచిన్

ABOUT THE AUTHOR

...view details