విశాఖ సాగర తీరంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ర్యాలీ నిర్వహించింది.కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకూ జరిగిన ప్రదర్శనలో బ్యాంకు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా డిప్యూటీ జనరల్ మేనేజర్ శేష్ కుమార్ మాట్లాడారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు.వికలాంగులు, వృద్ధుల ఆశ్రమాల్లో వాటర్ ఫిల్టర్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు.రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
సమాజ సేవకు... బ్యాంకు లాభాల్లో వాటా - visakhapatnam
సమాజ సేవను అందరూ అలవర్చుకోవాలని బ్యాంక్ ఆఫ్ బరోడా డిప్యూటీ జనరల్ మేనేజర్ శేష్ కుమార్ తెలిపారు. తమ బ్యాంకు 112వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రతిఏటా తమ లాభాల నుంచి కొంత మొత్తం సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నామని చెప్పారు.
'ప్రతీ ఏటా బ్యాంకు లాభాల నుంచి సమాజ సేవకు ఉపయోగిస్తున్నాం'