ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బంగ్లాదేశ్ నౌకలో ఆయిల్​ తొలగించేందుకు చర్యలు... ప్రత్యేక రోడ్డు ఏర్పాటు - Bangladesh ship Reached Visakha coastal Area news

బంగ్లాదేశ్​కు చెందిన ఎంవిమా 80 మీటర్ల పొడవైన నౌక విశాఖ తీరంలో యాంకరేజ్​లో ఉంది. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి సమయంలో సముద్రంలో వీచిన ఈదురు గాలుల ధాటికి షిప్ యాంకర్ చైన్ తెగిపోవడంతో తెన్నేటి పార్క్ సమీపంలోకి కొట్టుకొచ్చింది.

Bangladesh ship Reached Visakha coastal Area
యాంకర్ చైన్ తెగి తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ నౌక

By

Published : Oct 17, 2020, 2:15 PM IST

బంగ్లాదేశ్​కు చెందిన ఎంవిమా 80 మీటర్ల పొడవైన నౌక 2800 మెట్రిక్ టన్నుల క్వార్టైజ్​ను మోంగ్లా పోర్టుకు తీసుకువెళ్లేందుకు విశాఖ తీరంలో యాంకరేజ్​లో ఉంది. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి సమయంలో సముద్రంలో వీచిన ఈదురు గాలుల ధాటికి షిప్ యాంకర్ చైన్ తెగిపోవడంతో తెన్నేటి పార్క్ సమీపంలోకి కొట్టుకుని వచ్చింది. ఈ షిప్​లో 41 మెట్రిక్ టన్నుల ఫ్యూయల్, 9 మెట్రిక్ టన్నుల డీజిల్ ఉంది. ఇదే విషయాన్ని షిప్ యజమానికి తెలియజేసి షిప్​లోని అయిల్​ను తీసేందుకు మెస్సర్స్ ఎంఎస్ గిల్ మెరైన్​కు బాధ్యతలు అప్పగించారు. గిల్ మెరైన్ అయిల్​ను తీసేందుకు అవసరమైన అన్ని అనుమతులను ప్రభుత్వ సంస్ధల నుంచి తీసుకుంది.

అయితే షిప్ ఉన్న ప్రదేశానికి చేరుకునేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో తాత్కాలికంగా ఒక రోడ్డును నిర్మించారు. షిప్ వద్ద పనులు చేపట్టేందుకు అవసరమైన మనుషులను సామగ్రిని తరలించేందుకు వీలుగా ఈ తాత్కాలిక రోడ్డును నిర్మించారు. షిప్ చుట్టూ ఎటువంటి అయిల్ లీకేజీ లేకుండా చూసేందుకు విశాఖ పోర్టు ట్రస్టు నుంచి అవసరమైన సుశిక్షితులైన సిబ్బందిని పరికరాలను పంపించారు. షిప్ నుంచి ఆయిల్​ను తొలగించడానికి రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతుంది.

బీచ్​లో ఎటువంటి ఆయిల్ కలవకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ.. షిప్​లోని ఆయిల్​ను తీసివేసిన తరువాత తిరిగి సముద్రంలోకి తీసుకువెళ్లే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందుకోసం షిప్ యజమాని ఎంఎస్ రిసాల్వ్ మెరైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధతో ఇప్పటికే ఒప్పందం చేసుకున్నారు. ఇప్పటి వరకూ షిప్​లోనికి నీరు చేరడం గానీ షిప్ నుంచి ఆయిల్ లీకేజీ వంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు. బంగ్లాదేశ్​కు చెందిన 15 మంది సిబ్బంది ఇప్పటికీ షిప్​లోనే ఉన్నారు. షిప్​లో విద్యుత్ సరఫరాను పునరుద్దరించేందుకు ఎంఎస్ గిల్ మెరైన్ సంస్ధ ఒక జనరేటర్​ను ఏర్పాటు చేసింది.

ఇదీ చదవండీ... నిత్యావసరమే.. అత్యవసరంగా పొదుపుచేయాల్సిందే..

ABOUT THE AUTHOR

...view details