సింహాద్రి అప్పన్నను గాలిగోపురం దగ్గర నుంచి బంగ్లాదేశ్ హై కమిషనర్ మహమ్మద్ ఇమ్రాన్ దర్శించుకున్నారు. విశాఖ పర్యటనలో భాగంగా శ్రీవరాహలక్ష్మీనృసింహ స్వామివారి చెంతకు భారత్‌లో బంగ్లాదేశ్ హైకమిషనర్ సతీసమేతంగా వచ్చారు. స్వామి వారి స్థలపురాణం, క్షేత్ర మహిమ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పవిత్ర గంగధార గురించి తెలుసుకుని.. దర్శించుకున్నారు.
సింహాచలంలోని స్వామివారి దశావతారాలు, జలధారలు గురించి హైకమిషనర్ మహమ్మద్ ఇమ్రాన్‌కు అధికారులు వివరించారు.