బంగ్లాదేశ్ నౌకాదళం అడ్మిరల్ ఔరంగజేబ్ చౌధురి విశాఖ తూర్పు నావికాదళం ముఖ్యకార్యాలయం సందర్శనకు రానున్నట్టు... ఈఎన్‌సీ(ఈస్టన్ నేవల్ కమాండ్) వర్గాలు తెలిపాయి. భారత్, బంగ్లాదేశ్ నౌకాదళాల మధ్య పరస్పర సంబంధాలను మెరుగుపర్చేందుకు ఆయన పర్యటన దోహదపడనుందని వివరించాయి. విశాఖలోని కొన్ని నేవల్ యూనిట్లను ఆయన సందర్శిస్తారని నేవీ వర్గాలు తెలిపాయి. ఈఎన్‌సీ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండ్ వైస్‌అడ్మిరల్ అతుల్‌కుమార్ జైన్‌తో భేటీ కానున్నారు.
నేడు విశాఖకు రానున్న బంగ్లా నేవీ చీఫ్ - bangladesh navy chief at vizag
ఇవాళ్టి నుంచి రెండ్రోజుల పాటు విశాఖలో బంగ్లాదేశ్ నౌకాదళం అడ్మిరల్ ఔరంగజేబ్ చౌధురి పర్యటించనున్నారు. తూర్పు నావికాదళం ముఖ్య కార్యాలయాన్ని సందర్శించనున్నారు.

బంగ్లాదేశ్ నౌకాదళం అడ్మిరల్ ఔరంగజేబ్ చౌధురి