మహా విశాఖ నగరాభివృద్ధి సంస్థ మొత్తం అవినీతిమయంగా మాస్టర్ ప్లాన్ ఉందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అన్నారు. వీఎంఆర్డీఏ చరిత్రలో అత్యంత అవినీతి జరిగిందని ఆరోపించారు. వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ మీద ప్రజల నుంచి.. 16 వేల అభ్యంతరాల అప్లికేషన్లు వచ్చినా.. ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రిజర్వ్ ఫారెస్ట్‌లో అడ్డగోలుగా రోడ్డు ఎలా వేస్తారని నిలదీశారు. అవినీతికి పరాకాష్టగా ఫారెస్ట్ గెస్ట్ హౌస్ నుంచి హనుమంతు వాక వరకు రోడ్డు ఎందుకు మాస్టర్ ప్లాన్‌లో చేర్చారని అడిగారు. వెంటనే మాస్టర్ ప్లాన్ రద్దు చేసి కొత్తది వెయ్యాలని బండారు సత్యనారాయణ డిమాండ్ చేశారు.
GVMC: అవినీతిమయంగా జీవీఎంసీ మాస్టర్ ప్లాన్: బండారు సత్యనారాయణ - tdp comments on illegalities at gvmc
వీఎంఆర్డీఏ చరిత్రలో అత్యంత అవినీతి జరిగిందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఆరోపించారు. జీవీఎంసీ మొత్తం అవినీతి మయంగా మాస్టర్ ప్లాన్ ఉందన్నారు.
![GVMC: అవినీతిమయంగా జీవీఎంసీ మాస్టర్ ప్లాన్: బండారు సత్యనారాయణ bandaru sathyanarayana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12994896-518-12994896-1631011934115.jpg)
మాజీ మంత్రి బండారు సత్యనారాయణ
'విశాఖలో అక్రమాలపై విజయసాయి రెడ్డి టోల్ ఫ్రీ నెంబర్ అన్నారు.. ఆ నెంబర్ ఎంతో చెప్పాలి. కడు పేద విజయసాయి రెడ్డికి పేదల కోటాలో ఇంటి స్థలం కేటాయించాలి.'-బండారు సత్యనారాయణ, తెదేపా నేత
ఇదీ చదవండి: