విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డి తన స్వలాభం కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్ని నిర్వీర్యం చేస్తున్నారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. "ప్రగతి భారతి ఫౌండేషన్ పేరుతో భారీ మొత్తంలో విరాళాలు సేకరిస్తున్నారు. 300పడకలతో ఆసుపత్రి నిర్మించి సేవచేస్తామనటాన్ని తప్పుబట్టట్లేదు. కానీ ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్వలాభం కోసం భారీ మొత్తంలో విరాళాలు సేకరించటాన్ని ఖండిస్తున్నాం.
'సాయిరెడ్డి తన స్వలాభం కోసం ప్రభుత్వాసుపత్రుల్ని నిర్వీర్యం చేస్తున్నారు' - Bandaru criticize on MP Vijaysai reddy
వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిపై తెదేపా నేత బండారు సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. సాయిరెడ్డి తన స్వలాభం కోసం ప్రభుత్వాసుపత్రుల్ని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.
కేజీహెచ్, విమ్స్, చెస్ట్ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేక పేదలు, వైద్య సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఆయా ఆసుపత్రుల్లో మాస్కులు, గ్లౌజులు, పీపీఈ కిట్ల కొరత వేధిస్తోంది. 30నుంచి 40శాతం పారామెడికల్ సిబ్బంది పోస్టులు ఖాళీలున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే 200పడకల ఆసుపత్రికి అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. ప్రగతి భారతి ఫౌండేషన్ పేరుతో సేకరించిన నిధులను తక్షణమే కేజీహెచ్, విమ్స్, చెస్ట్ఆసుపత్రులకు కేటాయించాలి." అని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:'కొవిడ్ రెండు దశల్లో ఖర్చు, ఆదాయాలపై శ్వేతపత్రం ఇవ్వండి'