ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైద్యుల నిర్లక్ష్యంతోనే.. పాప చనిపోయిందంటూ ఆందోళన - baby death in vishakha parents protest infront of anupama surgical and childerns hosp

ఓ ప్రైవేట్ పిల్లల హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ పాప చనిపోయిందంటూ తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేసిన ఘటన విశాఖలో జరిగింది.

వైద్యుల నిర్లక్ష్యంతోనే పాప చనిపోయిందంటూ ఆందోళ

By

Published : Oct 13, 2019, 11:36 PM IST

వైద్యుల నిర్లక్ష్యంతోనే పాప చనిపోయిందంటూ ఆందోళ

వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ పాప చనిపోయిందంటూ విశాఖలో బంధువులు ఆందోళన చేపట్టారు. ద్వారకనగర్​లోని ఓ ప్రైవేట్ పిల్లల ఆసుపత్రిలో 5 రోజుల క్రితం భవిష్య అనే ఏడాదిన్నర వయస్సున్న పాపను గుండెలో కపం పట్టిందని తండ్రి అనిల్ కుమార్ చేర్పించారు. ఇవాళ ఉదయం హాస్పిటల్ సిబ్బంది ఇంజక్షన్ వేసిన అనంతరం పాపకు శ్వాస అందకపోవడంతో కేజీహెచ్​కు తరలించాలని వారు సూచించారని పాప తండ్రి అనిల్ తెలిపారు. అక్కడకు తీసుకువెళ్లగా పాప చనిపోయిందని చెప్పగా... వారంతా ఆగ్రహంతో తిరిగి పిల్లల హాస్పిటల్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని, హాస్పిటల్​ను సీజ్ చేయాలని పాప తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details