ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Ayyanna On YSRCP Govt: కక్ష సాధించడానికి.. సీఐడీని వాడుకోవడం దారుణం: అయ్యన్న

Ayyanna On YSRCP Govt: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అవినీతి కేసుకు.. మాజీ ఐఏఎస్ లక్ష్మీ నారాయణకు ఏం సంబంధమని తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. సీఐడీని కక్షసాధింపునకు వాడుకోవడం దారుణమని ఆయన మండిపడ్డారు.

సీఐడీని కక్ష సాధింపునకు వాడుకోవడం దారుణం
సీఐడీని కక్ష సాధింపునకు వాడుకోవడం దారుణం

By

Published : Dec 18, 2021, 3:26 PM IST

సీఐడీని కక్ష సాధింపునకు వాడుకోవడం దారుణం

Ayyanna On YSRCP Govt: వైకాపా ప్రభుత్వం.. కక్షసాధింపుకోసం సీఐడీని వాడుకోవడం దారుణమని.. తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో రూ. 240 కోట్ల అవినీతి జరిగిందని చెబుతున్నారన్న అయ్యన్న.. ఈ కేసుతో మాజీ ఐఏఎస్ లక్ష్మీ నారాయణకు ఏం సంబంధమని నిలదీశారు.

పోలీసు వ్యవస్థ ఎందుకు ఇలా తయారైందంటూ ప్రశ్నించారు. తన ఉద్యోగం కాపాడుకోవడానికి ఇలా ప్రవర్తిస్తారా? అని డీజీపీపై మండిపడ్డారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఎందుకు పెట్టారో జగన్‌కు తెలుసా? అని ప్రశ్నించిన అయ్యన్న.. అవినీతి ముఖ్యమంత్రి ఉంటే పరిశ్రమలు పెట్టడానికి ఎవరూ రారని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details