ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'భూముల కోసమే విశాఖపై ప్రేమ' - మాజీమ్ంత్రి అయ్యన్నపాత్రుడు వార్తలు

వైకాపా నేతలపై మాజీమంత్రి అయ్యన్న విమర్శలు గుప్పించారు. వారి ప్రేమ అంతా ఉత్తరాంధ్ర ప్రజలపై కాదని... అక్కడి భూములపై మాత్రమేనని విమర్శించారు.

ayyanna comments on sai reddy
మాజీమంత్రి అయ్యన్న

By

Published : Aug 17, 2020, 3:12 PM IST

విజయమ్మను ఓడించినందుకు దేవుడు విధించిన శిక్షే హుద్ హుద్ అంటూ రాక్షస మనస్తత్వాన్ని బయటపెట్టిన వైకాపా నాయకులు.... ఇప్పుడు విశాఖ పై కపట ప్రేమ నటిస్తున్నారు.. అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. వైకాపా నేతల ప్రేమ ఉత్తరాంధ్ర ప్రజలపై కాదని... ఇక్కడి భూమిపై మాత్రమేనని ఆయన ఆరోపించారు.

విజయనగరానికి తలమానికమైన మాన్సాస్ ట్రస్ట్ ని చెరబట్టారని మండిపడ్డారు. 50 వేల కోట్ల ఆస్తులు కలిగిన ట్రస్ట్ పై విజయసాయి కన్నుపడిందన్నారు. విశాఖలో కబ్జాలు, భూదందాల పర్వం మొదలయ్యిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖను విజయసాయి రియల్ ఎస్టేట్ దందాకు అడ్డాగా మార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టుబడిన వాళ్ళు తన వాళ్ళు కాదంటూ ఆయన ఇస్తున్న వాంగ్మూలం చూస్తే నవ్వొస్తోందని అయ్యన్న ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details