ఇంత విచిత్రపు ఎన్నికలు ఎప్పుడు చూడలేదని తెదేపా నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ప్రజలు, పత్రికల సాక్షిగా వైకాపా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ శాఖలన్నీ ఈసీ పరిధిలో ఉంటాయన్న విషయం తెలియని వ్యక్తి సీఎంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులను పోలీసులు బెదిరిస్తున్నారన్న ఆయన... పోలీసులు వైకాపా కార్యకర్తలుగా మారిపోయారని విమర్శించారు. 151 మంది ఎమ్మెల్యేలలో సీఎం సామాజిక వర్గానికి చెందిన వారికే పదవులు దక్కాయని ఆరోపించారు. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే పోలీసులపై నమ్మకంపోతుందన్నారు. అందుకే కేంద్ర బలగాలను తీసుకొచ్చి ఎన్నికలు జరపాలని అయ్యన్న పాత్రుడు కోరారు. విశాఖ తెదేపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన సీఎం జగన్పై విమర్శలు చేశారు.
కరోనాపై సీఎం వ్యాఖ్యలు అవగాహనారాహిత్యం : అయ్యన్న పాత్రుడు
స్థానిక ఎన్నికల్లో వైకాపా తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. పోలీసులు వైకాపా కార్యకర్తల్లా మారిపోయారని విమర్శించిన ఆయన... నామినేషన్లు వేసిన అభ్యర్థుల్ని పోలీసులు బెదిరిస్తున్నారన్నారు. కరోనా మహమ్మారిపై సీఎం జగన్కు కనీస అవగాహన లేదని, పారసిటమాల్, బ్లీచింగ్ అని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు.
అయ్యన్న పాత్రుడు
కరోనాపై సీఎం జగన్ అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారని అయ్యన్న అన్నారు. పారసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ చల్లితే చాలని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారన్నారు. చైనా, ఇటలీ, అమెరికా వారికి ఈ విషయం తెలియక కోట్లు ఖర్చు పెడుతున్నారా అని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి :ప్రకృతి విపత్తు కరోనా...మానవ విపత్తు వైకాపా: శైలజానాథ్