విశాఖ నగరంలోని కంచరపాలెంలో వార్డు సచివాలయాన్ని మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. లక్ష మందికి ఉద్యోగాలు కల్పించామన్న మంత్రి ముత్తంశెట్టి.... ఒక్క పొరపాటు కూడా జరగకుండా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియమాకాలు చేపట్టామన్నారు. నియామకాల్లో పొరపాట్లు జరిగినట్లు రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ముత్తంశెట్టి సవాల్ చేశారు. జీవీఎంసీలో మిగిలిన ఖాళీల భర్తీకి ప్రణాళికలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బొత్స వ్యాఖ్యాతగా మారి అభ్యర్థులతో మాట్లాడించారు.
'నియామకాల్లో అవకతవకలు రుజువు చేస్తే...రాజీనామా చేస్తా' - రుజువు చేస్తారా... రాజీనామా చేస్తా : మంత్రి ముత్తంశెట్టి
ఒక్క పొరపాటు లేకుండా గ్రామ, వార్డు సచివాలయ నియామకాలు చేపట్టామని మంత్రి ముత్తంశెట్టి తెలిపారు. నియామకాల్లో అవకతవకలు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.

'నియామకాల్లో అవకతవకలు రుజువు చేస్తే...రాజీనామా చేస్తా'
'నియామకాల్లో అవకతవకలు రుజువు చేస్తే...రాజీనామా చేస్తా'
ఇదీ చదవండి :
Last Updated : Oct 2, 2019, 11:03 PM IST