ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో రాష్ట్రంలో పర్యటకాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రపంచ పర్యటక దినోత్సావాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కొవిడ్‌తో తీవ్రంగా దెబ్బతిన్న పర్యటక రంగాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకువస్తామన్నారు. రాష్ట్రానికి ముఖ్య ఆర్థికవనరుగా టూరిజంను తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పర్యాటకశాఖ సీఈఓ ప్రవీణ్ కుమార్, విశాఖ కలెక్టర్ వినయ్ చంద్, ఎమ్మెల్యేలు, టూర్ ఆపరేటర్లు, ప్రముఖ హోటళ్ల నిర్వాహకులు పాల్గొన్నారు.