ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆరేటి ఉమామహేశ్వరరావు దందాలపై చర్యలు తీసుకోవాలి' - vizag au latest news

"ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పీహెచ్​డీ స్కాలర్ ఆరేటి ఉమామహేశ్వరరావు​ చేస్తున్న దందాలపై తగు చర్యలు తీసుకోవాలి" అని ఏయూ టీచింగ్​, నాన్​ టీచింగ్​ సిబ్బంది డిమాండ్​ చేశారు. ఆరేటి చేస్తున్న పీహెచ్​డీ.. ఏయూ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున వీసీ సంతకం చేయలేదని చెప్పారు.

au teaching staff and non teaching staff protest on phd scholar areti uma maheswara rao
ఏయూ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నిరసన

By

Published : Aug 11, 2020, 11:00 PM IST

ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఆరేటి ఉమామహేశ్వరరావు అనే పీహెచ్​డీ స్కాలర్ దందాలు చేస్తున్నారని.. చర్యలు తీసుకోవాలని వర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది కోరారు. ఆర్టీఐ యాక్ట్​లను సుమారు ఆరు వందల సార్లు ఉపయోగించి ఏయూలోని టీచింగ్, నాన్-టీచింగ్, ఉన్నత అధికారులను సైతం బెదిరిస్తూడని వారు వాపోయారు. అతనిపై చర్యలు తీసుకోవాలని ఏయూ హిందీ విభాగ ఆచార్యుడు నల్ల సత్యనారాయణ, ఆచార్య షారోన్ రాజ్​ డిమాండ్ చేశారు.

అంతకు ముందు...

తన పీహెచ్​డీ ఫైలుపై నెలరోజులకు పైగా వీసీ సంతకం పెట్టడం లేదంటూ... గత రెండు రోజులుగా ఆరేటి ఏయూ ప్రధాన ద్వారం వద్ద నిరసన చేపట్టారు. ఈ నిరసనకు తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, టీఎన్​ఎస్​ఎఫ్​ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ మద్దతు తెలిపారు.

ఇదీ చదవండి:

'దాడులు చేసే వారిపై చర్యలు తీసుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details