ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

94వ వసంతంలోకి ఆంధ్ర విశ్వవిద్యాలయం - andra univercity

హరిత వనాన్ని తలపించే పచ్చటి అందాలు... మనసును మైమరపించే చల్లని గాలులు... ఎటు చూసినా సుందర ప్రకృతి సోయగాలు... విద్యా కుసుమాలను తీర్చిదిద్దే చదువుల వనంగా దశాబ్దాల చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం మరో మైలురాయిని అధిగమిస్తోంది.1926 ఏప్రిల్26న ఆవిర్భవించిన ఏయూ ఎప్పటికప్పుడు నూతన ఉత్సాహంతో సమున్నత లక్ష్యాలను నిర్దేశించుకుంటూ నేడు 94వ వసంతంలోకి అడుగుపెడుతోంది.

ఆంధ్ర విశ్వవిద్యాలయం

By

Published : Apr 26, 2019, 5:36 AM IST

తెలుగు భాష మూలాల నుంచి పుట్టి, తెలుగు మాట్లాడే వారికి ఓ వర్సిటీ ఉండాలనే లక్ష్యంనుంచి ఆవర్భవించిన విద్యాలయం ఏయూ... కట్టమంచి రామలింగా రెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణ, వీఎస్ కృష్ణ వంటి మహోన్నత వ్యక్తుల సారథ్యంలో దేశానికి దశా దిశా చూపించే ఎంతో మంది మహోన్నతులను అందించి నేటికి ఎంతో మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతోంది.

ఆంధ్ర విశ్వవిద్యాలయం
దేశ భవిష్యత్తు అవసరాలకు అనుగుణమైన కోర్సులను అందించడంలో ఏయూ ఎప్పుడూ ముందంజలోనే ఉంటోంది. ఆసియాలో మొట్టమొదటి ఎంబీఏ కోర్సు ఏయూలోనే ప్రారంభమైంది. న్యూక్లియార్ ఫిజిక్స్, న్యూక్లియర్ కెమిస్ట్రీ, మెరైన్ ఇంజినీరింగ్, మెటీరి యాలజీఅండ్ ఓషియనోగ్రఫీ వంటి కోర్సులను దేశానికి అందించిన ఘనత ఏయూకే దక్కింది. రక్షణ శాఖ అవసరాలకు అనుగుణంగా నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీకు సంబంధించిన వివిధ కోర్సులను అందిస్తూ ఏయూ దేశ వ్యాప్తంగా ఓప్రత్యేక గుర్తింపును సాధించింది. విద్యా బోధన పరంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఘనత ఓ ఎత్తైతే... పర్యావరణ హితంగా ఈ వర్సిటీని నిలపడంలో ఇక్కడి సిబ్బంది తీసుకునే జాగ్రత్తలు మరో ప్రత్యేకత అనేచెప్పాలి. విశాఖ నగరంలో ఇంతటి పచ్చదనం మరెక్కడా కనిపించదనే చెప్పాలి.హరిత వర్సటీగా పేరు తెచ్చుకోవడే కాదు. పర్యావరణహిత విద్యుత్ ఉత్పత్తి దిశగా వర్సటీ అడుగులు వేస్తోంది. ఏయూలో చదువు కోవడం ఓ అద్భుతమని విద్యార్థులు చెబుతున్నారు. ఇంత ఆహ్లాదకరంగా ఉండే ప్రదేశంలో ఉండడం తమకు ఓ ప్రత్యేక అనుభూతినిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఏయూ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొనేందుకు విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో జరగనున్న వ్యవస్థాపక దినోత్సవంలో... వర్సిటీకి సేవలు అందించి... 80ఏళ్లు పైబడిన సిబ్బందికి ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details