ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విదేశీ విద్యార్థిపై దాడి.. నలుగురు యువకులు అరెస్ట్​ - attack on andhra university student

విదేశీ విద్యార్థిపై దాడిచేసిన నలుగురు యువకుల్ని విశాఖ మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.

attack on foreign student
విదేశీ విద్యార్థిపై దాడి

By

Published : Mar 24, 2021, 6:18 PM IST

విదేశీ విద్యార్థిపై దాడిచేసిన నలుగురు యువకుల్ని విశాఖ మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. జోర్డాన్‌ దేశానికి చెందిన విద్యార్థి మహమ్మద్‌ మదూర్‌ అబుకీర్‌... ఆంధ్ర యూనివర్సిటీలో ఎంటెక్‌ చదువుతున్నాడు. సిరిపురంలోని ఓ పెట్రోలు బంకు వద్దకు ద్విచక్ర వాహనానికి ఇంజిన్‌ ఆయిల్‌ మార్చడానికి వెళ్లిన మహమ్మద్‌ మదూర్‌ అబుకీర్‌ను.. అదే సమయంలో అక్కడకు వచ్చిన నలుగురు యువకులు పక్కకు తప్పుకోమని అన్నారు.

దీనికి ప్రతిగా... మీరే అటు వెళ్లండంటూ అబుకీర్‌ సమాధానమిచ్చాడు. కోపోద్రిక్తులైన యువకులు అతనిపై దాడిచేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నలుగురు యువకుల్ని అరెస్ట్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details