ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈ బడ్జెట్​లో.. విశాఖ రైల్వేజోన్ పరిస్థితేంటో?​ - railway budget news

విశాఖ రైల్వేజోన్‌ ప్రకటించి ఏడాది కావోస్తున్నా.... ఆచరణలో మాత్రం అర అంగుళమూ ముందడుగు పడలేదు. ఇవాళ కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లోనైనా  జోన్‌కు సంబంధించిన నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయన్న ఆశ నగర రైల్వే వర్గాల్లో కనిపిస్తోంది. నిధులతో సహా వాల్తేర్‌ డివిజన్‌ను విశాఖ జోన్‌లోనే ఉంచుతూ  కొత్త రైల్వే మార్గాలు వేయాలని ఆకాంక్షిస్తున్నారు.

ఈ బడ్జెట్​లో.. విశాఖ రైల్వేజోన్ పరిస్థితేంటో?​
ఈ బడ్జెట్​లో.. విశాఖ రైల్వేజోన్ పరిస్థితేంటో?​

By

Published : Feb 1, 2020, 5:38 AM IST

Updated : Feb 1, 2020, 7:22 AM IST

ఈ బడ్జెట్​లోనైనా.. విశాఖ రైల్వేజోన్ పరిస్థితేంటో?​

గతేడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు చేయబోతున్నట్టు కేంద్రం ప్రకటించింది. ప్రత్యేక అధికారిని నియమించి నివేదికతో సహా అన్నీ సమర్పించినా.... ఇప్పటికీ ప్రత్యేక జోన్‌ కార్యాచరణలోకి రాలేదన్నది వాస్తవం. బడ్జెట్‌లో విశాఖ జోన్‌ ప్రస్తావన ఉండటం సహా... వాల్తేర్‌ డివిజన్‌ను ఇందులోనే ఉంచాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది.

ఈ బడ్జెట్‌లో విశాఖ జోన్‌ ప్రారంభోత్సవంతోపాటు అవసరమైన మౌలిక సదుపాయల కల్పనపైనా దృష్టి పెట్టాలని రైల్వే ఉద్యోగుల సంఘం నేతలు కోరుతున్నారు. నగరం నుంచి వివిధ కీలక ప్రదేశాలకు రైలు మార్గాలు వేయాలంటున్నారు.

ఇదీ చదవండి: పద్దు 2020: బడ్జెట్​ సూట్​కేస్ చరిత్ర తెలుసా?

Last Updated : Feb 1, 2020, 7:22 AM IST

ABOUT THE AUTHOR

...view details