సింహాచలం దేవస్థాన ఛైర్మన్ విషయంపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం మళ్లీ కోర్టుకి వెళ్తుందని... రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విశాఖ వైకాపా కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. అశోక్ గజపతిరాజు కేవలం సింహాచలం దేవస్థానం ఛైర్మన్ మాత్రమేనని... విజయనగరానికి మొత్తానికి రాజు కాదని అన్నారు. అశోక్ గజపతిరాజు కొన్ని వందల ఎకరాలు దోచుకున్న వ్యక్తి అని విమర్శించారు.
అశోక్ గజపతిరాజు జైలుకి వెళ్లడం తప్పదు: విజయసాయిరెడ్డి - AP News
అశోక్ గజపతిరాజుపై ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాన్సాస్ ట్రస్ట్‌లో వందల ఎకరాలు కాజేశారని ఆరోపించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అశోక్ గజపతిరాజుపై గతంలో ఫోర్జరీ కేసు కూడా ఉందన్నారు. అశోక్ గజపతిరాజు జైలుకి వెళ్లడం తప్పదన్నారు. సింహాచలం ఛైర్మన్ ఇష్యూపై అప్పీల్‌కు వెళ్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
అశోక్ గజపతిరాజు అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేయిస్తోందని విజయసాయి వ్యాఖ్యానించారు. ఆయన ఏదో ఒకరోజు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని జోస్యం చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం... స్త్రీ, పురుషుల మధ్య వత్యాసం లేదని, కానీ మాన్సాస్ ట్రస్టులో మాత్రం ఒక్క పురుషులు మాత్రమే ఛైర్మన్‌గా ఉండాలనే నిబంధన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ నియమాలు ప్రకారమే ప్రభుత్వం నడుచుకుందని.. మహిళలను గౌరవించేలా ఆలోచిస్తుందని చెప్పారు.
ఇదీ చదవండీ... GOOD NEWS: 10,143 ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ విడుదల