Presidential Fleet Review: పీఎఫ్ఆర్(ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ) కోసం తూర్పు నౌకాదళం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఐఎన్ఎస్ సుమిత్రలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రయాణించి నౌకలలో ఉన్న సిబ్బంది నుంచి వందనం అందుకుంటారు. వీటికి అదనంగా 55 ఎయిర్ క్రాప్టులు, సబ్మెరైన్ల సిబ్బంది ఇందులో పాల్గొంటారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన హవ్ ఎయిర్ క్రాప్టులు సైతం ఇందులో పాలు పంచుకుంటాయి. నౌకలన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో ఈ రివ్యూ కోసం సిద్ధంగా ఉంచుతారు.
Presidential Fleet Review: మెరైన్ కమాండోలు చేయనున్న ప్రమాదంలో కాపాడే ఘట్టం, నీటి పారాజంప్ లాంటివి చూపరులను ఆశ్చర్యపరుస్తాయి. హవ్ ఎయిర్ క్రాప్టు నుంచి ఎరోబెటిక్స్ ఫార్మేషన్ కూడా సాహసానికి మరోరూపంగా నిలవనుంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి తొలి రోజు పోస్టల్ కవర్, పోస్టల్ స్టాంపులను విడుదల చేయనున్నారు. ఇందులో కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవ్ సిన్హా జే చౌహాన్ పాల్గొననున్నారు.
ఈనెల 21 నుంచి విశాఖ వేదికగా..
శత్రువులను ధైర్యంగా ఎదుర్కొవాలంటే ముందు మన శక్తిసామర్థ్యాలు ఎంత మేరకు ఉన్నాయో తెలిసి ఉండాలి. ఏ మేరకు పోరాడగలమో సమీక్షించుకోవాలి. అలా నౌకాదళ బలాన్ని సమీక్షించేదే ప్రెసిడెంట్ ప్లీట్ రివ్యూ. ఈనెల 21 నుంచి విశాఖ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొంటారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల 20నే విశాఖ వెళ్లనున్నారు. రాష్ట్రపతిని ఆహ్వానించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.