విశాఖ మన్యం అంటే ముందుగా గుర్తొచ్చేది అరకు అందాలు. ఇరుకైన ప్రయాణ మార్గాలు. వెళ్లినవారెవరైనా ప్రకృతికి ఫిదా అవ్వాల్సిందే. ప్రతి మది పులకరించాల్సిందే. అంతలా ఇక్కడి అందాలు కనువిందు చేస్తాయి. అందరినీ కట్టిపడేస్తాయి.
ఆంధ్రా ఊటీగా పేరొందిన ఊటీలో కాఫీకి ప్రత్యేకత ఉంది. చల్లని వేళల్లో వేడి వేడి కాఫీని గొంతులోకి పోస్తుంటే వచ్చే మజా మాటల్లో చెప్పలేనిది. ప్రతి గుటకలోనూ సరికొత్త రుచి పరిచయమవుతుంది. పొగలు కక్కే కాఫీ ఘుమఘుమలకు చలి పులి పరార్ కావాల్సిందే.
అరకు మార్గంలో కనిపించే గిరిజన కాఫీ దుకాణాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. సంప్రదాయ పద్ధతిలో ఈ మన్యం కాఫీ స్టాల్స్ కట్టెల పొయ్యిపై వేడి వేడి కాఫీ తయారు చేస్తూ ఆంధ్రా ఊటీకి స్వాగతం పలుకుతాయి.