ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 28, 2022, 7:06 PM IST

ETV Bharat / city

ఆ రెండు ఘటనలతో రాజ్యాంగమే అంతిమమైనదని నిరూపితమైంది: అశోక్ గజపతిరాజు

రాజ్యాంగమే అంతిమమైనది అన్న విషయం పద్మనాభం, రామతీర్థం దేవాలయాల ఘటనల్లో కోర్టు తీర్పుల ద్వారా నిరూపితమైందని సింహాద్రి అప్పన్న దేవాలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు అన్నారు. సింహాద్రి అప్పన్న సన్నిధిలో జరిగిన ఆలయ ట్రస్ట్ బోర్డు సమావేశం పాల్గొన్న ఆయన..బోర్డు అయినా, అధికారులైనా భక్తుల అవసరాలు, దేవాలయాల అభివృద్ధికి పాటుపడాలన్నారు.

అశోక్ గజపతిరాజు
అశోక్ గజపతిరాజు

సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు ఆధ్వర్యంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సమావేశం జరిగింది. సమావేశంలో 27 అభివృద్ధి పనులకు సభ్యులు బోర్డు ఆమోదం తెలిపింది. సీతమ్మధార వద్దనున్న ఆంజనేయ స్వామి దేవాలయానికి 1000 గజాల స్థలం ఇవ్వాలనే ప్రతిపాదనను నలుగురు సభ్యులు తిరస్కరించారు. ఆలయ పరిసర ప్రాంతం, రోడ్డుకు 300 గజాల స్థలానికే అనుమతి ఉందని అన్నారు.

ఆలయ ఛైర్మన్ అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ.. బోర్డు అయినా, అధికారులైనా భక్తుల అవసరాలు, దేవాలయాల అభివృద్ధికి పాటుపడాలన్నారు. దేవాలయ ఆస్తులను కాపాడాలనే ఉద్దేశ్యంతోనే ఆనాడు న్యాయస్థానాన్ని ఆశ్రయించానని వెల్లడించారు. అప్పన్న కృప వల్ల చట్టం ప్రకారం ఛైర్మన్​గా కొనసాగే అర్హత తనకే ఉందని తీర్పు వెల్లడైందన్నారు. తాను ఛైర్మన్​గా కొనసాగని.., రెండు సంవత్సరాల కాలంలో ట్రస్ట్ బోర్డ్ ఆమోదం లేకుండా ఎన్ని అనుమతులు ఇచ్చారన్నది తెలుసుకోవాలన్నారు. రాజ్యాంగమే అంతిమమైనది అన్న విషయం పద్మనాభం, రామతీర్థం దేవాలయాల ద్వారా నిరూపితమైందని ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details