ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

‘సింహాచలం’ ఆలయ ఆస్తులు ‘లీజు’కు ఇచ్చేందుకు ప్రణాళిక - లీజుకు విశాఖ సింహాచలం దేవస్థానం భూములు

విశాఖపట్నంలోని ‘సింహాచలం’ అప్పన్న స్వామి ఆలయానికి చెందిన కీలక ప్రాంతాల్లో ఉన్న దాదాపు రూ.కోట్ల విలువైన 16.06 ఎకరాలను 11 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇందులో భాగంగా వేపగుంట, అడవివరం, గోపాలపట్నం, పురుషోత్తపురంలోని బీఆర్‌టీఎస్‌ రోడ్డుకు ఆనుకొని ఉన్న ఈ స్థలాలను వాణిజ్య అవసరాలకు వినియోగించుకునేలా ఈ-టెండర్‌ కం పబ్లిక్‌ ఆక్షన్‌ విధానంలో లీజుకు ఇవ్వనున్నారు.

appana lands
appana lands

By

Published : Aug 27, 2020, 7:33 AM IST

గురువారం నిర్వహించే దేవస్థానం పాలకవర్గ సమావేశ అజెండాలో ఈ అంశాన్ని చేర్చారు. ‘కొవిడ్‌’ పరిస్థితుల దృష్ట్యా దేవస్థాన ఆదాయం పెంచుకునేందుకే లీజు ప్రతిపాదన తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. కొందరు పెద్దలు ఈ భూములను దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఉద్యోగులకు సంబంధించిన ఎటువంటి అంశాలను అజెండాలో చేర్చకపోవడంపై వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

విశాఖను రాజధానిగా ప్రకటించడంతో...

విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడి భూములకు అమాంతం విలువ పెరిగింది. ఈ నేపథ్యంలో దేవస్థానానికి చెందిన భూములపై కొందరి కన్నుపడడంతోనే లీజు ప్రతిపాదన తీసుకొచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సింహాచలం దేవస్థానానికి నగరంలోని పలు ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే భూములున్నాయి. వీటిలో ఇప్పటికే కొన్ని ఆక్రమణల్లో చిక్కుకున్నాయి. మరికొన్ని అధికారికంగా లీజు రూపంలోఅప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

లీజుకు ఇచ్చేందుకు గుర్తించిన భూములివే...

  • విశాఖలోని వివిధ ప్రాంతాల్లో రోడ్డు పక్కనే దేవస్థానానికి చెందిన ఖాళీ స్థలాలను లీజుకు ఇచ్చేందుకు అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.కోట్లల్లో ఉంటుందని అంచనా. మొత్తంగా 16.06 ఎకరాలను లీజుకు ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నారు.
  • వేపగుంట చిత్రాడవారి తోట సర్వే నంబరు 187లోని 1.65 ఎకరాలను అన్ని రకాల సౌకర్యాలతో కూడిన భారీ ఫంక్షన్‌ హాలు నిర్మాణానికి ఇవ్వనున్నారు. ఇదే ప్రాంతంలో సర్వే నంబరు 275లోని రెండు ఎకరాలను వాహనాల పార్కింగ్‌ కోసం వినియోగించనున్నారు.
  • గోపాలపట్నం కూడలిలోని సర్వే నంబరు 4/1లో 0.80 సెంట్లలో భారీ వాణిజ్య సముదాయం.
  • అడవివరం గ్రామ పరిధి ఎన్‌ఎస్‌టీఎల్‌ సమీపంలో సర్వే నంబరు 275/పీలో గ్రీన్‌బెల్ట్‌ ఏరియాలోని 8 ఎకరాల్లో ఓపెన్‌ ఆడిటోరియం.
  • పెందుర్తి మెయిన్‌రోడ్డులో పురుషోత్తపురం వద్ద సర్వే నంబరు 12/1లో 1.79 ఎకరాల్లో ఓ మధ్యస్థాయి కళ్యాణ మండపం. మరో సర్వే నంబరు 9లో 1.82 ఎకరాల్లో వాణిజ్య సముదాయం.

ఇదీ చదవండి:తెలుగునాట వినోదాల వీచిక.. 'ఈటీవీ' రజతోత్సవ వేడుక

ABOUT THE AUTHOR

...view details