ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కరోనా ప్రభావం తగ్గాకే.. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి'

రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఏపీ ఎన్జీవో ఎన్నికల సంఘాన్ని కోరింది. ప్రాణాలు పణంగా పెట్టి పని చేయడం కష్టమని ఆ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్​ రెడ్డి స్పష్టం చేశారు.

APNGO President request to SEC over local body elections
చంద్రశేఖర్​ రెడ్డి

By

Published : Nov 3, 2020, 9:20 PM IST

కరోనా ప్రభావం తగ్గిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నట్టు రాష్ట్ర నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం పేర్కొంది. కరోనా సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి పని చేయడం కష్టమని సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు.

విశాఖ ఏపీ ఎన్జీవో కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 26 కరోనా కేసులు ఉంటేనే ఎన్నికలు వాయిదా వేశారని.. అలాంటిది ఇప్పుడు లక్షల సంఖ్యలో కేసులు ఉంటే ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సరికాదన్నారు. కరోనా ప్రభావం తగ్గిన తరువాతే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని చెప్పారు. కరోనా ప్రభావం ఉన్న సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే.. ఉద్యోగుల ప్రాణాల గురించి ఎన్నికల సంఘం ఆలోచించాలని ఏపీ ఎన్జీవో కోరుతుందన్నారు.

ఇదీ చదవండీ... రాష్ట్ర ఎన్నికల కమిషనర్​కు‌ ప్రభుత్వం సహకరించాలి: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details