డిస్కంల ప్రతిపాదనలపై విశాఖలోని ఈపీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం రెండోరోజు బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఇది ముగిసిన తర్వాత ఏపీఈఆర్‌సీ సభ్యులు ఠాకుర్ రామ్‌సింగ్‌తో కలిసి ఛైర్మన్ మీడియాతో మాట్లాడారు. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై (పీపీఏ) అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఇప్పటికైతే ఈ ప్రతిపాదన తమ పరిశీలనలోకి రాలేదని, వచ్చినా సహేతుకమైన నిర్ణయాన్నే వెల్లడిస్తామని తెలిపారు.
వ్యవసాయ చట్టాలపై..
కొత్త వ్యవసాయ చట్టాలతో డిస్కంలు, ఈఆర్‌సీ మనుగడకే ప్రమాదమని సీపీఎంకు చెందిన ఓ నేత ప్రజాభిప్రాయ సేకరణలో అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని ప్రస్తావించినప్పుడు ఇవన్నీ ముందే ఊహించుకుంటున్నవని, ఆ చట్టాలు రాజ్యాంగబద్ధంగా లేనప్పుడు కోర్టులో సవాలు చేసుకోవచ్చని జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి తెలిపారు. కొవిడ్ సమయంలో పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయినా కనీస విద్యుత్తు ఛార్జీల పేరుతో డిస్కంలు బిల్లులు తీసుకుంటున్న వైనంపై విలేకరులు ప్రశ్నించినప్పుడు.. ఏడాదికి సరిపడా టారిఫ్ ఉత్తర్వులిస్తామని, ఆ ఏడాదిలో మార్పుచేర్పులుంటే డిస్కంల దగ్గరికెళ్లి విన్నవించాల్సి ఉంటుందని తెలిపారు.
ఇదీ చదవండి:రాజధాని భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు: కేసులు కొట్టేసిన హైకోర్టు