ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వైకాపా ప్రభుత్వం రైతు వ్యతిరేకమని ఎప్పుడో స్పష్టమైంది' - shilajanath comments on jagan

కేంద్ర ప్రభుత్వం రైతులకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని... ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతు వ్యతిరేకమని ఎప్పుడో స్పష్టమైందన్నారు. నూతన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మాణం చేసి.. కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.

APCC Chief Fires on Modi Over new Agriculture Bills
శైలజానాథ్

By

Published : Dec 1, 2020, 5:56 PM IST

కేంద్రం నూతనంగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించాలని, రైతులకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో ఈ బిల్లులకు మద్దతు పలికిన జగన్... ఒట్టి మాటలు కట్టిపెట్టి అసెంబ్లీలో ఈ బిల్లులకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం రైతు వ్యతిరేకమని ఎప్పుడో స్పష్టమైందన్నారు. కొవిడ్ అదుపులోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు జరిగిన స్థానిక ఎన్నికల ప్రక్రియ అంతా రద్దు చేసి... తిరిగి తాజా నోటిఫికేషన్ ఇవ్వాలనే కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి చెబుతోందన్నారు.

ABOUT THE AUTHOR

...view details